పల్లవి: కలవంటిది నీ జీవితం కడు స్వల్పకాలము
యువకా అది ఎంతో స్వల్పము
విలువైనది నీ జీవితం - వ్యర్ధము చేయకుమా
యువకా వ్యర్థము చేయకుమా
బహు విలువైనది నీ జీవితం - వ్యర్థము చేయకుమా
యువతీ వ్యర్థము చేయకుమా ॥కలవంటిది॥
1. నిన్ను ఆకర్షించే ఈ లోకము - కాటువేసే విషసర్పము
యువకా అది కాలుజారే స్థలము - ఉన్నావు పాపపు పడగ నీడలో
నీ అంతము ఘోర నరకము
యువకా... ఆదియే నిత్య మరణము కలవంటిది
2. నిన్ను ప్రేమించు యేసు నీ జీవితం - నూతన సృష్టిగా
మార్చును పాపం క్షమియించి రక్షించును
ఆ మోక్షమందు నీవుందువు - యుగయుగములు జీవింతువు
నీవు... నిత్యము ఆనందింతువు ॥కలవంటిది॥

0 Comments