పల్లవి: పరిశుద్ధ పరిశుద్ధ - పరిశుద్ధ ప్రభువా
వరదూతలైన నిన్ వర్ణింపగలరా
1. పరిశుద్ద జనకుడ - పరమాత్మ రూపుడ
నిరుపమ బలబుద్ధి - నీతి ప్రభావా ॥పరిశుద్ధ॥
2. పరిశుద్ద తనయుడ - నరరూప ధారుడ
నరులను రక్షించు - కరుణా సముద్రా ॥పరిశుద్ధ॥
3. పరిశుద్ద మగునాత్మ - వరము లిడునాత్మ
పరమానంద ప్రేమ - భక్తుల కిడుమా ॥పరిశుద్ధ॥
4. జనక కుమారాత్మ - లనునేక దేవా
ఘన మహిమ చెల్లును దనర నిత్యముగా ॥పరిశుద్ధ॥

0 Comments