నా ఆవేదనలలో జనించెనే నీ కృపాదారణ - (2)
1.నీ కృప నాలో వ్యర్ధము కాలేదు - నీ కృపా వాక్యమే
చేదైన వేరు ఏదైన నాలో - మొలవనివ్వలేదులే (2)
నీ కృప నాలో అత్యున్నతమై
నీతో నన్ను అంటు కట్టెనే (2) || నా గీతా ||
2.చేనిలోని పైరు చేతికి రాకున్నా - ఫలములన్ని
రాలిపోయినా
సిరి సంపదలన్ని దూరమై పోయినా - నేను
చలించనులే (2)
నిశ్చలమైన రాజ్యము కొరకే
ఎల్లవేళలా నిన్నే ఆరాధింతునే (2) || నా గీతా ||
3. ఆత్మాభిషేకం నీ ప్రేమ నాలో - నిండుగా
కుమ్మరించెనే
ఆత్మ ఫలములెన్నో మెండుగ నాలో - ఫలింపజేసెనే (2)
ఆత్మతో సత్యముతో ఆరాధించుచు
నే వేచియుందునే నీ రాకడకై (2) || నా గీతా ||
0 Comments