124. Viswasamu Lekunda Devuniki | విశ్వాసము లేకుండా దేవునికి | Song Lyrics

పల్లవి : విశ్వాసము లేకుండా దేవునికి
ఇష్టులైయుండుట అసాధ్యము ||2||
విశ్వాసము ద్వారా మన పితరులెందరో 
రాజ్యాల్ని జయించినారు ||2||

1. హనోకు తన మరణము చూడకుండ 
పరమునకు ఎత్తబడిపోయెనుగా ||2||
ఎత్తబడకమునుపే దేవునికి 
ఇష్టుడైయుండినట్లు సాక్షమొందెను ||2|| ॥ విశ్వాసము ॥

2.నోవహు దైవభయము కలవాడై 
దేవునిచే హెచ్చింపబడిన వాడై ||2||
ఇంటివారి రక్షణకై ఓడను కట్టి 
నీతికే వారసుడని సాక్షమొందెను ||2|| ||విశ్వాసము ॥

3. మోషే దేవుని బహుమానము కొరకై
ఐగుప్తు సుకాబోగలను ద్వేషించి ||2||
శ్రమలనుభవించుటే  భాగ్యమని 
స్థిరబుద్ది గలవాడై సాక్షమొందెను ||2|| ||విశ్వాసము ॥

3.వీరందరు సాక్ష్యము పొందియున్నను 
మనము లేకుండా సంపూర్ణులు కారు ||2||
అతి పరిశుద్ధమైన విశ్వాసముతో 
మరి శ్రేష్ఠమైన సీయోనుకే సిద్ధపడెదము ||2||॥ విశ్వాసము ||

Post a Comment

0 Comments