పల్లవి: అదే అదే ఆ రోజు - యేసయ్య ఉగ్రతరోజు
యేడేండ్ల శ్రమల రోజు- పాపులంత ఏడ్చే రోజు
1. సూర్యుడు నలుపయ్యే రోజు - చంద్రుడు ఎరుపయ్యే రోజు
భూకంపము కలిగే రోజు - దిక్కులేక అరచేరోజు
ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు ॥అదే॥
2. వ్యభిచారులు ఏడ్చేరోజు - మోసగాళ్ళు మసలే రోజు
అబద్ధికులు అరచేరోజు - దొంగలంత దొర్లే రోజు
ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు ॥అదే॥
3. పిల్లజాడ తల్లికిలేక - తల్లిజాడ పిల్లకు లేక
చెట్టుకొకరు పుట్టకొక్కరై - అనాధలై మిగిలే రోజు
ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు ॥అదే॥
4. ఓ మనిషి యోచించవా - నీ బ్రతుకు ఎలా వున్నదో
బలము చూచి భంగపడకుమా ధనము చూచి దగా పడకుమా
ఆరోజు శ్రమనుండి తప్పించే నాధుడు లేడు ॥అదే॥

0 Comments