92 | Halleluya Yesu Prabhun | హల్లెలూయ యేసు ప్రభున్ | Calvary Temple

పల్లవి: హల్లెలూయ యేసు ప్రభున్ - యెల్లరు స్తుతియించుడి 
వల్లభుని చర్యలను తిలకించి స్తుతియించుడి 
బలమైన పనిచేయు - బలవంతున్ స్తుతియించుడి 
ఎల్లరిని స్వీకరించు - యేసుని స్తుతియించుడి ॥రాజుల॥

అ.ప: రాజుల రాజైన యేసురాజు- భూజనులనేలున్ 
హల్లెలూయ హల్లెలూయా - దేవుని స్తుతియించుడి

1. తంబురతోను వీణతోను - ప్రభువును స్తుతియించుడి 
పాపమును రక్తముతో - తుడిచెను స్తుతియించుడి 
బూరతోను తాళములన్ మ్రోగించి స్తుతియించుడి 
నిరంతరము మారని యేసుని స్తుతియించుడి ॥రాజుల॥

2. సూర్యచంద్రులారా ఇల దేవుని స్తుతియించుడి 
హృదయమును వెలిగించిన - యేసుని స్తుతియించుడి 
అగ్ని వడగండ్లార మీరు - కర్తను స్తుతియించుడి 
హృదయమును ఒప్పించిన - నాధుని స్తుతియించుడి ॥రాజుల॥

3. యువకులారా పిల్లలారా - దేవుని స్తుతియించుడి 
జీవితమున్ ప్రభు పనికై - సమర్పించి స్తుతియించుడి
పెద్దలారా ప్రభువులారా - యెహోవాను స్తుతియించుడి
ఆస్తులను యేసునకై - అర్పించి స్తుతియించుడి ॥రాజుల॥

4. అగాధమైన జలములారా - దేవుని స్తుతియించుడి 
అలలవలె సేవకులు - లేచిరి స్తుతియించుడి 
దూతలారా భక్తులారా - దేవుని స్తుతియించుడి 
పరమందు పరిశుద్ధులు - ఎల్లరు స్తుతియించుడి ॥రాజు॥

Post a Comment

0 Comments