పల్లవి: పరలోకము నా దేశము పరదేశి నేనిల
మాయలోకమేగా నేను యాత్రికుడను ॥పరలోకము॥
1. ఎంతో అందమైనది పరలోకము - అసమానమైనది ఆ దేశము
ఎల్లప్పుడు విశ్వాసముతో - యాత్రను సాగింతును॥పరలోకము॥
2. దూతలు పాడుచుందురు పరమందున
దివారాత్రములందు పాడుచుందురు
పావనుని చూచి నేను - హర్షింతును నిత్యము ॥పరలోకము॥
3. రక్షకుని చెంతకు - యెప్పుడేగెదన్
వీక్షించెద నెప్పుడు - నాదు ప్రియుని
కాక్షించెద నామదిలో - ఆయన చెంతనుండ ॥పరలోకము॥
4. అద్దరికి ఎప్పుడు - నేను వెళ్ళెదన్
అగుపడుచున్నది - గమ్యస్థానము
అచ్చటనే చూచెదను - పరిశుద్ధు లెల్లరిన్ ॥పరలోకము॥
5. నిత్యానందముండును పరమందున
నీతి సమాధానము - ఉండునచ్చట
పొందెదను విశ్రాంతిని - శ్రమలన్నియు వీడి ॥పరలోకము॥

0 Comments