పల్లవి: కుమ్మరీ! ఓ కుమ్మరీ! జగదుత్పత్తి దారీ!
జిగట మన్నైన నావంక చల్లగ చూడుమయ్యా...
1. పనికి రాని పాత్రనని పారవేయకుమా
పొంగిపొర్లు పాత్రగ చేసి నన్ను నింపుమా
సువార్తలోని పాత్రలన్నీ శ్రీయేసున్ పొగడుచుండ
సాక్షిగ నుండు పాత్రగ జేసి సత్యముతో నింపుము తండ్రి ॥కుమ్మరి॥
2. విలువలేని పాత్రన్ నేను కొనువారు లేరెవ్వరూ
వెలలేని నీదు రక్తంబుతో వెలుగొందు పాత్రగ జేసి
ఆటంకముల నుండి తప్పించి నన్ను ఎల్లప్పుడు కావుమయ్యా
పగిలియున్న పాత్రన్ నేను సరిజేసి వాడుమయ్యా ॥కుమ్మరి॥
3. లోకాశతో నిండి ఉప్పొంగుచూ మార్గంబునే దప్పితిన్
మనుష్యేచ్ఛలన్నియు స్థిరమనుచునే మనశ్శాంతి కోల్పోతిని
పొగొట్టుకొన్న పాత్రయనుచు పరుగెత్తి నిను పట్టితిన్
ప్రాణంబు నాలోనున్నప్పుడే నీ పాదంబుల్ నేపట్టితిన్॥కుమ్మరి॥

0 Comments