71 | Enni Thalachina Edhi Adigina | ఎన్ని తలచినా - ఏది అడిగినా | Calvary Temple

పల్లవి: ఎన్ని తలచినా - ఏది అడిగినా 
జరిగేది నీ చిత్తమే - ప్రభువా జరిగేది నీ చిత్తమే 
నీ వాక్కుకై వేచియుంటిని - నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా

1. నీ తోడు లేక నీ ప్రేమ లేక - 
యిలలోన ఏ ప్రాణి నిలువలేదు 
అడవి పువ్వులే నీ ప్రేమ పొందగా 
నా ప్రార్థన ఆలకించుమా ప్రభువా...

2. నా యింటి దీపం నీవే అని తెలిసి 
నా హృదయం నీ కొరకై పదిలపరచితి 
ఆరిపోయిన నా వెలుగు దీపము 
వెలిగించుము నీ ప్రేమతో ప్రభువా...

3. ఆపదలు నన్ను వెన్నంటి యున్నా 
నా కాపరి నీవై నన్నాదుకొంటివి 
లోకమంతయు నన్ను విడిచినా 
నీ నుండి వేరుచేయవు ప్రభువా...

4. నా స్థితి గమనించి నన్ను ప్రేమించి 
నాకొరకై కల్వరిలో యాగమైతివి 
నీదు యాగమే నా మోక్ష మార్గము 
నీ యందే నిత్యజీవము ప్రభువా...

Post a Comment

0 Comments