70 | Ujjivamimmu Ma Deva | ఉజ్జీవమిమ్ము మా దేవా | Calvary Temple

పల్లవి: ఉజ్జీవమిమ్ము మా దేవా నీ ప్రజలమైన మముబ్రోవ 
నీ అగ్నిచేత మము కాల్చి మాదు బ్రతుకులను మార్చు దేవా

1. తొలిమేడగదిలో అల భక్తవరులు నినుకూడి వేడినారే
ఇల చిన్న గుడిలొ వెలుగొంద నీదు సన్నిధిని కూడినామే 
అగ్నివోలె ఆత్మన్ బంపి అందరిని వెలిగించుమయా 
వరముల ఫలముల దాతవునీవే దేవా కరుణించుమా ॥ ఉజ్జీవ॥ 

2. పడియున్న యెరికోబాటసారి గాంచి వడివడిగా వచ్చినావే
నీ చేయి చాపి నను లేవనెత్తి షాలేము చేర్చినావే 
దారిగానక పడియుంటిమి కారు మూర్ఖులమై పోతిమి 
మార్గము సత్యము జీవము నీవే దేవ కరుణించుమా ॥ఉజ్జీవ॥

3. ఈ లోక వేషముల మోసపోతిమి ఆశ్రయంబు నీవే 
శ్రీ యేసుదేవ మము కావరావ మరుదారి వేరు లేదే 
నరక కూపపు పొలిమేరలో మమ్ము కలిసిన మా దేవుడా 
చేతిని చాపి పాడెనుముట్టి మమ్ము బ్రతికించావా ॥ఉజ్జీవ॥

Post a Comment

0 Comments