పల్లవి: తీర్మానించుకో తీర్మానించుకో - తీర్మానించుకో ఈ క్షణమే
ప్రభు సన్నిధిన్ తీర్మానించుకో
1. బతుకు వలె నిదురించకు - నిదురించదు సుమ నాశనము
నశియింపక నేడే - ఆలమటించు ఆయనకై
2. విశ్వాసినని ఊగకు విలపించు ఆత్మలకై ఈ విశ్వంలో
విభుడేసుతో పాలొందగా - వీక్షించు ఆ రాకకై
3. పరవశించకు పాపములో - పశ్చాత్తాపము నొందగా
ప్రభుయేసు సిలువను పరికించు నీ మనసున
4. ఏటేట జరుగునట్లు - ఈ సభలన్ని జరుగునని
తలపోసి తెలుసికొనక - తరిగిన తనువులెన్నో యిలన్॥ తీర్మా॥
5. ఒకవైపు పరిశుద్ధాత్మ- మరొకవైపు అపవాది
శోధించుచు పిలచుచుండ - ఏవైపో? తీర్మానించుకో!||తీర్మా||

0 Comments