పల్లవి: దేవుడు మనకు ఎల్లప్పుడు తోడుగా నున్నాడు.
1. ఏదేనులో ఆదాముతో నుండెను హానోకు తోడ నేగెను
దీర్ఘ దర్శకులతో నుండెను ధన్యులు దేవునిగలవారు ॥తో॥
2. దైవాజ్ఞను శిరసావహించి- దివ్యముగ నాబ్రహాము
కన్న కొమరుని ఖండించుటకు - ఖడ్గము నెత్తినయపుడు ||తో॥
3. యోసేపు ద్వేషింప బడినపుడు- గోతిలో త్రోయబడినపుడు
శోధనలో చెరసాలయందు సింహాసనమెక్కినయపుడు ॥తో॥
4. ఎర్రసముద్రపు తీరమునందు - ఫరో తరిమిన దినమందు
యోర్ధాను దాటిన దినమందు - యెరికో కూలిన దినమందు॥తో॥
5. దావీదు సింహము నెదిరించి ధైర్యాన చీల్చినయపుడు
గొల్యాతును హతమార్చినపుడు-సౌలుచే తరుమబడినపుడు॥ తో॥
6. పౌలు బంధించబడినపుడు - పేతురు చెరలో నున్నపుడు
అపోస్తలులు విశ్వాసులు - హింసించబడిన యపుడు ॥తో॥
7. సింహపు బోనులో దానియేలు - షడ్రక్ మేషాక బెద్నెగో
అగ్ని గుండములో వేయబడన్ - నల్గురుగా కనబడినపుడు||తో॥

0 Comments