పల్లవి: రండీ రండీ వినిపించుదాము - ప్రభు యేసు ప్రేమ గీతం
రండీ రండీ సాగించుదాము - శ్రీ యేసు శాంతి సమరం
1. శ్రీ యేసు మనకు యజమానుడు ఆయన శాంతికరుడు
స్తోత్రార్హుడు స్తుతిపాత్రుడు- మనుజాళి ప్రాణప్రియుడు
2. మరియమ్మ సుతుడై జనియించినాడు - పరలోకమును వీడినాడు.
మన పాపములకై బలియైనవాడు చావున్ జయించినాడు
3. న్యాయాధిపతిగా రానున్నవాడు రాజాధిరాజు ఘనుడు
నవజీవప్రాప్తి కలిగించువాడు - క్రీస్తేను కరుణాలుడు
4. అపవాది క్రియలు లయపర్చువాడు - అపురూప దైవసుతుడు
ఆశ్చర్యకరుడు అసమానరేడు - అసలైన సంఘవరుడు

0 Comments