59 | Premamaya Yesu Prabhuva | ప్రేమమయా యేసు ప్రభువా | Calvary Temple

పల్లవి: ప్రేమమయా యేసు ప్రభువా - నిన్నే స్తుతింతును ప్రభువా 
అనుదినమూ అనుక్షణము - నిన్నే స్తుతింతును ప్రభువా ॥ప్రే॥

1. ఏ యోగ్యత లేని నన్ను - నీవు ప్రేమతో పిలిచావు ప్రభువా
నన్నెంతగానో ప్రేమించినావు - నీ ప్రాణమిచ్చావు నాకై ॥ప్రే॥

2. ఎదవాకిటను నీవు నిలిచి - నా హృదయాన్ని తట్టావు ప్రభువా 
హృదయాంగణములోకి అరుదెంచినావు - నాకెంతో ఆనందమే॥ప్రే॥

3 . శోధనలు నను చుట్టుకొనినా - ఆవేదనలు నను అలుముకొనినా 
శోధన రోధన ఆవేధనలో - నిన్నే స్తుతింతును ప్రభువా ॥ప్రే॥

Post a Comment

0 Comments