పల్లవి: ఆశ్చర్యకరుడా - నా ఆలోచన కర్తవు
నిత్యుడగు తండ్రివి - నా షాలేము రాజువు
1. సింహపు పిల్లలైనా - కొదువ గలిగి ఆకలిగొనినా
నీ పిల్లలు ఆకలితో - అలమటింతురా
నీ వున్నంత వరకు
2. విత్తని పక్షులను - నిత్యము పోషించుచున్నావు
నీ పిల్లలు వాటికంటే - శ్రేష్టులే కదా
నీ వున్నంత వరకు
3. చీకటి తొలగె - నీతి సూర్యుడు నాలో ఉదయించె
నీ సాక్షిగా వెలుగుమయమై - తేజరిల్లెదను
నీ వున్నంత వరకు

0 Comments