50 | Sarvachittambu Needhenayya | సర్వచిత్తంబు నీదేనయ్యా | Calvary Temple

పల్లవి: సర్వచిత్తంబు నీదేనయ్యా - స్వరూపమిచ్చు కుమ్మరివే 
సారెపైనున్న మంటినయ్యా - సరియైన పాత్రన్ జేయుమయ్యా 
సర్వేశ్వరా నే రిక్తుండను - సర్వదా నిన్నే సేవింతును ॥సర్వ॥

1. ప్రభూ! సిద్ధించు నీ చిత్తమే - ప్రార్ధించుచుంటి నీ సన్నిధి 
పరికింపు నన్నీదివసంబున - పరిశుభ్రమైన హిమముకన్న 
పరిశుద్ధున్దేసి పాలింపుమా - పాపంబుబోవ నను కడుగుమా

2. నీ చిత్తమే సిద్ధించు ప్రభూ - నిన్నే ప్రార్ధింతు నా రక్షకా 
నీచమౌ గాయముల చేతను - నిత్యంబు కృంగి అలసియుండ 
నిజమైన సర్వ శక్తుండవే - నీచేతబట్టి నన్ రక్షింపుమా

3. ఆత్మ స్వరూప నీ చిత్తమే - అనిశంబు చెల్లు ఇహపరమున 
అధికంబుగా నన్నీయాత్మతో - ఆవరింపుమో నా రక్షకా 
అందరూ నాలో క్రీస్తుని జూడ - ఆత్మతో నన్ను నింపుము దేవా

Post a Comment

0 Comments