పల్లవి: దేవా దేవా - నన్ను కావుమా - నా జీవ యాత్రలో సర్వమై
కంటి పాపవలె నాదీపమై - నీ నీడలో నను నిలుపుమా
నీ ఆత్మతో నను నింపుమా
1. కారు చీకటి మార్గంలో - భారమైన పయనంలో
మమత లెరుగని మనుజులలో సిలువ మోయు యాత్రలో
శృతిని మీటేనీ.. పలుకులే నను - పదిల పరచె నన్నునీ...
పాద సేవలో యేసువా...
2. నీదు మౌన జవాబులలో - నీ హృదయ మెరుగుట నేర్పుము
యెహోవా యీరె - నీవే నా సర్వమై
యెహోవా నిస్సీ - నా విజయం నీవని
యెహోవా రొఫెక - స్వస్థత నీవై
యెహోవా షమ్మా తోడు నుందువని ఎరుగుటకు ఇల నేర్పుమూ
పాద సేవలో యేసువా...

0 Comments