పల్లవి: అదిగో నా నావ - బయలు దేరుచున్నది
nఅందులో యేసు ఉన్నాడు - నా నావలో క్రీస్తు ఉన్నాడు
1. వరదలెన్ని వచ్చినా వణకను - అలలెన్నో కొట్టినా అదరను
ఆగిపోయే అడ్డులొచ్చినా - సాగిపోయే సమయమాయెను (2)
2. లోతైన దారిలో పోవుచున్నది - సుడిగుండాలెన్నో తిరుగుచున్నది
సూర్యుడైన ఆగిపోయెను - చుక్కాని మాత్రం సాగిపోయెను(2)
3. నడిరాత్రి జాములో నడచినా - నడి సముద్ర మధ్యలో నిలచినా
నడిపించును నా యేసు - అద్దరికి నన్ను చేర్చును (2)

0 Comments