పల్లవి: రండీ యెహోవాను గూర్చి - ఉత్సాహ గానము చేసెదము
ఆయనే మన పోషకుడు - నమ్మదగిన దేవుడని (2)
ఆహా హల్లెలూయా – ఆహా హల్లెలూయా (2)
1. కష్టనష్టము లెన్నున్నా - పొంగు సాగర లెదురైన
ఆయనే మన ఆశ్రయం - ఇరుకులో ఇబ్బందులలో (2)
2. విరిగి నలిగిన హృదయముతో - దేవ దేవుని సన్నిధిలో
అనిశము ప్రార్ధించిన - కలుగు ఈవులు మనకెన్నో (2)
3. త్రోవ తప్పిన వారలను - చేరదీసే నాధుడని
నీతి సూర్యుండాయనే అని నిత్యము స్తుతి చేయుదము (2)

0 Comments