30 | Prardhana Vinedi Pavanuda | ప్రార్ధన వినెడి పావనుడా | Calvary Temple

పల్లవి: ప్రార్ధన వినెడి పావనుడా - 
ప్రార్ధన మాకు నేర్పుమయ్యా

1. శ్రేష్టమైన భావము గూర్చి - 
శిష్య బృందముకు నేర్పితివి 
పరముడ నిన్ను ప్రణుతించెదను 
పరలోక ప్రార్ధన నేర్పుమయ్యా ॥ప్రార్ధన॥

2. పరమ దేవుడవని తెలిసి - 
కరములెత్తి జంటగ మోడ్చి 
శిరమును వంచి సరిగను వేడిన 
సుంకరి ప్రార్ధన నేర్పుమయ్యా ॥ప్రార్ధన॥

3. దినములోన జేసిన సేవ 
దైవ చిత్తముకు సరిపోవ 
దీనుడవయ్యా ఒంటిగ కొండను 
చేసిన ప్రార్ధన నేర్పుమయ్యా ॥ప్రార్ధన॥

4. శత్రుమూక నిను చుట్టుకొని 
సిలువపైన నిను చంపగను 
శాంతముతో నీ శత్రుల బ్రోవగ 
సలిపిన ప్రార్ధన నేర్పుమయ్యా ॥ప్రార్ధన॥

Post a Comment

0 Comments