పల్లవి: ఎందుకో నన్నింతగా నీవు ప్రేమించితివో దేవా
అందుకో నా దీన స్తుతిపాత్ర- హల్లెలూయా యేసయ్య
1. నా పాపము బాప నరరూపివైనావు
నా శాపము మాప నలిగి వ్రేలాడితివి
నాకు చాలిన దేవుడవు నీవే - నా స్థానములో నీవే ॥ఎందుకో
2. నీ రూపము నాలో నిర్మించి యున్నావు
నీ పోలికలోనే నివసించుమన్నావు
నీవు నన్ను ఎన్నుకొన్నావు - నీ కొరకై నీ కృపలో ॥ఎందుకో॥
3. నా శ్రమలు సహించి నా ఆశ్రయమైనావు
నా వ్యధలు భరించి నన్నాదుకొన్నావు
నన్ను నీలో చేర్చుకొన్నావు - నను దాచి యున్నావు ॥ఎందుకో॥
4. నీ సన్నిధి నాలో నా సర్వము నీలో
నీ సంపద నాలో నా సంతసము నీలో
నీవు నేను ఏకమగు వరకు నను విడువనంటివే ॥ఎందుకో॥
5. నా మనవులు ముందే నీ మనసులో నెరవేరే
నా మనుగడ ముందే నీ గ్రంథములో నుండే
ఏమి అద్భుతప్రేమ సంకల్పం - నీకేమి చెల్లింతున్ ॥ఎందుకో॥

0 Comments