పల్లవి: నా ప్రియ యేసురాజా- అదుకో నన్నెపుడు
శోధనలో వేదనలో - నిను వీడి పోనియ్యకు
1. కలుషితమగు ఈలోకం - కదిలెను నా కన్నులలో
మరణ శరీరపు మరులే- మెదిలెను నా హృదయములో
కల్వరిలో ఆదరించు! ఆదరించు! ఆదరించు ||నా ప్రియ||
2. మరచితి నీ వాగ్దానం సడలెను నా విశ్వాసం
శ్రమల ప్రవాహపు సుడులే వడిగా నను పెనుగొనగా
కల్వరిలో ఆదరించు! ఆదరించు! ఆదరించు ॥నా ప్రియ॥
3. నేరములెన్నో నాపై - మోపెను ఆ అపవాది
తీరని పోరాటములో - దూరముగా పరుగిడితి
కల్వరిలో ఆదరించు! ఆదరించు! ఆదరించు ॥నా ప్రియ||

0 Comments