27 | Paramandhuba Doothalu Paaduchunnaru | పరమందున దూతలు పాడుచున్నారు | Calvary Temple

పల్లవి: పరమందున దూతలు పాడుచున్నారు 
ఇహమందున భక్తులారాధించుచున్నారు 
స్తుతియు ఘనత ప్రభావములు మన యేసునకే చెల్లును 
హల్లెలూయా ఆమేన్ - హల్లెలూయా ఆమేన్ 
హల్లెలూయా ఆమేన్ (2)

1. సుందరులలో అతి సుందరుడు - పదివేలలో అతిప్రియుడు 
కాంక్షనీయుడు కారుణ్యమూర్తి - కరుణతో మము బ్రోచెన్

2. శ్రేష్టులలో అతి శ్రేష్టుండు - మన ప్రభునకు సమమెవరూ 
చిందించే రక్తం బలినిచ్చె ప్రాణం - పరమున నిను చేర్చన్

3. పరిశుద్ధుడు అతి పరిశుద్ధుడు - నేత్రములే అగ్ని జ్వాలలు 
జయించె సాతానున్ లోకంబున్ గెల్చెను
జయశాలిగ నను చేసెన్ 

Post a Comment

0 Comments