26 | Nee Swaramu Vinipinchumu Prabhuva | నీ స్వరము వినిపించు ప్రభువా | Calvary Temple

పల్లవి: నీ స్వరము వినిపించు ప్రభువా - నీ దాసుడు ఆలకించున్ 
నీ వాక్యమును నేర్పించు - దానియందు నడుచునట్లు నీతో

1. ఉదయమునే లేచి నీ స్వరము వినుట నాకు ఎంతో మధురము 
దినమంతటి కొరకు నను సిద్ధపరచి రక్షించు ఆపదలనుండి

2. నీ వాక్యము చదివి నీ స్వరము వినుచు నేను సరిజేసుకొందు 
నీ మార్గములో నడచునట్లుగా నేర్పించుము ఎల్లప్పుడు

3. భయ భీతులలో తుఫానులలో నీ స్వరము వినిపించుము 
అభయము నిమ్ము ఓగొప్ప దేవా ధైర్యపరచుము నన్ను

4. నాతో మాట్లాడు స్పష్టముగా ప్రభువా నీ స్వరము నా కొరకే 
నీతో మనుష్యులతో సరిజేసుకొందు నీదివ్య వాక్యము ద్వారా

5. నీ వాక్యము అగ్ని సుత్తె వంటిది అది రెండంచుల ఖడ్గం 
నీ వాక్యమేగా అద్భుత అద్దం నిజ స్వరూపమును చూపించున్

6. నేర్చుకొన్నాను నా శ్రమల ద్వారా నీ వాక్యమును ఎంతో 
నన్నుంచుము ప్రభువా నీ విశ్వాస్యతలో నీయందు నిలచునట్లు

7. నా హృదయములోని చెడు తలంపులను ఛేదించు నీవాక్యము 
నీ రూపమునకు మార్చుము నన్ను నీదు మహిమ కొరకేగా

Post a Comment

0 Comments