24 | Sthuthi Sthuthi Sthuthi Sthuthi | స్తుతి స్తుతి స్తుతి స్తుతి - స్తుతికి పాత్రుడా | Calvary Temple

పల్లవి: స్తుతి స్తుతి స్తుతి స్తుతి - స్తుతికి పాత్రుడా 
ప్రతిక్షణం దీవిని దూత గణము పరమున 
శుద్ధుడు పరిశుద్ధుడంచు పొగడుచుండగా 
నేను కూడ చేరి నిన్ - స్తుతింతు యేసువా ॥స్తుతి॥

1. రాజువై రారాజువై ఆ.. తండ్రితో ఆ..సీనుడై 
మహిమ దేహంబుతో నుండగా 
ధవళవస్త్ర తేజరాజ నా విమోచకా 
నేను కూడ చేరి నిన్ స్తుతింతు యేసువా ॥స్తుతి॥

2. సిల్వలో స్రవించిన - నీ.. రక్తమే నా.. హృదయమున్ 
హిమముకంటె తెల్లగా మార్చెను 
భక్తిపరుల కాశ్రయంబు నీదు పదములే 
నేను కూడ చేరి నిన్ స్తుతింతు యేసువా ॥స్తుతి॥

3. లోకము శరీరము - సా.. తానుడు నా., వైరులై 
నన్ను కవ్వించి మోసగించినా 
కంటిపాప రీతినన్ను కాచి యుంటివి 
నేను కూడ చేరినిన్ స్తుతింతు యేసువా॥స్తుతి॥

Post a Comment

0 Comments