25 | Neetho Samamevaru | నీతో సమమెవరు | Calvary Temple

పల్లవి: నీతో సమమెవరు - నీలా ప్రేమించేదెవరు 
నీలా క్షమియించేదెవరు - యేసయ్యా 
నీలా పాపికై ప్రాణం పెట్టిన - వారెవరు ?

1. లోక బంగారము - ధన ధాన్యాదులు 
ఒకపోగేసినా - నీతో సరితూగునా 
జీవ నదులన్నియు - సర్వ సంద్రములు 
ఒకటై ఎగసినా - నిన్ను తాకగలవా 
లోక సౌఖ్యాలన్నీ ఒకచోట కుమ్మరించిన 
నీవెగా చాలిన దేవుడవు ॥నీతో॥

2. పలు వేదాలలో - మతగ్రంథాలలో 
పాపమే సోకని - పరిశుద్ధుడేడి 
పాప పరిహారార్ధం సిలువ మరణమొంది 
తిరిగి లేచినట్టి - దైవ నరుడెవ్వరూ 
నీలా పరిశుద్ధ దేవుడెవరున్నారయా 
నీవేగా మంచి దేవుడవు ॥నీతో॥

3. నేను వెదకకున్నా - నాకు దొరికితివి 
నేను ప్రేమించకున్నా - నన్ను ప్రేమించితివి 
పలు గాయాలు చేసి తరచు రేపితిని 
నన్నెంతో సహించి - క్షమియించితివి 
నీలా జాలిగల ప్రేమగల దేవుడేడి 
నీవెగా విమోచకుడవు ॥నీతో॥

Post a Comment

0 Comments