23 | Naalo Ninnu Chudanee | నాలో నిన్ను చూడనీ | Calvary Temple

పల్లవి: నాలో నిన్ను చూడనీ - నీతో బ్రతుకు సాగని 
నీ వాక్యపు వెలుగులో - అందరు నన్ను చూడని ॥నాలో॥

1. లోకమునకు వెలుగుగా - అందరికి ఉప్పుగా 
కుంచముపై దీపముగా - కొండమీది పట్టణముగా 
అందరు నాలో నిను చూచి 
డెందములో నిను స్తుతియింపని ॥నాలో॥

2. నూతనమగు సృష్టిగా- పరమునకు సాక్షిగా 
పరిశుద్ధాత్మకు నిలయముగా - ప్రభువా నీకే ఆలయముగా 
పరిశుద్ధముగా జీవించి - నీకే మహిమను కలిగించ ॥నాలో॥

Post a Comment

0 Comments