22 | Ninne Ninne Ne Koluthunayya | నిన్నే నిన్నే నే కొలుతునయ్యా | Calvary Temple

పల్లవి: యేసయ్యా యేసయ్యా - యేసయ్యా యేసయ్యా 
నిన్నే నిన్నే నే కొలుతునయ్యా 
నీవే నీవే నా రాజువయ్యా 
యేసయ్యా... యేసయ్యా... యేసయ్యా...

1. కొండలలో లోయలలో అడవులలో ఎడారులలో 
నన్ను గమనించినావా - నన్ను నడిపించినావా 
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా  ॥నిన్నే॥

2. ఆత్మీయులే నన్ను అవమానించగా 
అన్యులే నన్ను అపహాసించగా 
అండ నీవైతివయ్యా - నా కొండ నీవే యేసయ్యా 
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా  ॥నిన్నే॥

3. మరణ ఛాయలో మెరిసిన నీ ప్రేమ 
నలిగిన బ్రతుకున కురిసిన నీ కృప 
నన్ను బలపరచెనయ్యా - నిన్నే ఘనపరతునయ్యా 
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥నిన్నే॥

4. వంచెన వంతెన ఒరిగిన భారాన 
పొసగక విసిగిన విసిరే కెరటాన 
కలలా కడతేర్చినావా - నీ వలలో నను మోసినావా 
యేసయ్యా యేసయ్యా యేసయ్యా యేసయ్యా ॥నిన్నే॥

Post a Comment

0 Comments