పల్లవి: దేవుని వారసులం ప్రేమ నివాసులము
జీవన యాత్రికులం - యేసుని దాసులము
నవయుగ సైనికులం - పరలోక పౌరులము హల్లెలూయ
నవయుగ సైనికులం - పరలోక పౌరులము
1. దారుణ హింసలలో దేవుని దూతలుగా
ఆరని జ్వాలలలో - ఆగని జయములతో
మారని ప్రేమ సమర్పణతో
సర్వత్ర యేసుని కీర్తింతుము ॥దేవుని॥
2. పరిశుద్దాత్మునికై ప్రార్ధన సలుపుదుము
పరమాత్ముని రాక - బలము ప్రసాదింప
ధరణిలో ప్రభువును జూపుటకై
సర్వాంగ హోమము చేయుదము ॥దేవుని॥
3. సజీవ సిలువ ప్రభు - సమాధి గెలుచుటచే
విజేత ప్రేమికులం - విధేయ బోధకులం
నిజముగ రక్షణ ప్రబలుటకై
ధ్వజముగ సిలువను నిలుపుదము॥దేవుని॥

0 Comments