పల్లవి: ఆనందమే - ప్రభు యేసుని స్తుతించుట
ఆత్మానంద - గీతముల్ పాడెద ॥ఆనందమే॥
1. సిలువలో నాకై - రక్తము కార్చెను
సింహాసనమునకై - నన్నును పిలిచెను
సింహపు కోరల నుండి - నన్ను విడిపించెను ॥ఆనందమే॥
2. విశ్వాసమును - కాపాడుకొనుచూ
విజయుడైన యేసుని - ముఖమును చూచుచూ
విలువైన కిరీటము - పొందెద నిశ్చయము ॥ఆనందమే॥
3. నా మానస వీణను మ్రోగించగా
నా మనో నేత్రములందు కనిపించె ప్రభు రూపమే
నా మదిలోన మెదిలేను - ప్రభు సప్తస్వరాలు ॥ఆనందమే॥

0 Comments