పల్లవి: వందనము నీకే నా వందనము
వర్ణనకందని నీకే నా వందనము
1. నీ ప్రేమ నేనేల మరతు - నీ ప్రేమ వర్ణింతునా
దాని లోతు ఎత్తు నేగ్రహించి
నీ ప్రాణ త్యాగమునే తలంచి ॥వందన॥
2. సర్వ కృపానిధి నీవే - సర్వాధిపతియును నీవే
సంఘానికి శిరస్సు నీవే
నా సంగీత సాహిత్యము నీవే ॥వందన॥
3. మృతి వచ్చెనే ఒక నుండి - కృప వచ్చెనే నీలోనుండి
కృషిలేక నీకృప రక్షించెను - కృతజ్ఞతాలర్పింతును ॥వందన॥

0 Comments