పల్లవి: మట్టివిరా వట్టివిరా - మన్నువురా మన్నవురా
కాయము మాయము - ఖాయమురా అయ్యయ్యో!
1. అటుచేసి ఇటుచేసి అందరిని మోసం చేసి
సంఘాన్ని రెండుగ చీల్చావే అయ్యయ్యో
నీ గోతిలో నువ్వే పడ్డావే - అయ్యయ్యో!॥మట్టివిరా॥
2. నువు వేసిన వేషాలు నువు చేసిన మోసాలు
నరకాగ్నికి నిను చేర్చునులే అయ్యయ్యో
నరకాగ్నిలో కాలిపోదువులే అయ్యయ్యో॥మట్టివిరా॥
3. నీ బ్రతుకు దెరువుకోసం బైబిల్ను చేతబట్టి
పరమార్ధం మర్చిపోయావే - అయ్యయ్యో
ఆత్మలతో ఆడుకొన్నావే - అయ్యయ్యయ్యో ॥మట్టివిరా॥
4. సువార్త సేవకోసం పంపిన సొమ్ములన్నీ
సొంతానికి ఖర్చు చేశావే - అయ్యయ్యో
శాపాన్ని తెచ్చుకున్నావే - అయ్యయ్యో ॥మట్టివిరా॥
5. పాపాన్ని పాతిపెట్టి - దోషాన్ని దాచిపెట్టి
దొరలాగ తిరుగుచున్నావే - అయ్యయ్యో
తొందరలో దొరికిపోతావే - అయ్యయ్యో ॥మట్టివిరా॥
6. నీ పాపం ఒప్పుకుంటే - ఆ పాపం విడిచిపెడితే
పరలోకం నిన్ను చేర్చునులే యేసయ్యా
నీ పాపం కడిగివేయునులే మెస్సయ్యా ॥మట్టివిరా॥

0 Comments