పల్లవి: సారా సర్పమురా - అది కాటు వేయక తప్పదురా!
విస్కీ విషమురా - అది ప్రాణం తీయక ఒప్పదురా!
చావు గోతిని తవ్వుకోకురా ఆ.... ఆ.... ఆ....
చావు గోతిని తవ్వుకోకురా - నిన్ను నీవే చంపుకోకురా!
చావు గోతిని తవ్వుకోకురా - పైకి పోకముందే దేవుని నమ్ముకోరా!
1. తాళిబొట్టు తాకట్టు పాలు - కట్టుకున్నది కష్టాల పాలు
కష్టార్జితము పరుల పాలు - కన్న పిల్లలు కన్నీటి పాలు
మద్యపానము ముదనష్ట పాలు ఆ.... ఆ.... ఆ....
ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు ॥సారా॥
2. పరువు కాస్తా బజారు పాలు - అరువు కరువు రోదన పాలు
తనువు కాస్తా రోగాల పాలు - బ్రతుకు చితుకు కాష్టము పాలు
మద్యపానము ముదనష్ట పాలు ఆ.... ఆ....ఆ....
ఆత్మపూర్ణులై బ్రతుకుట మేలు ॥సారా॥

0 Comments