14 | Gurthuchesuko O Priyudaa | గురుతు చేసుకో ఓ ప్రియుడా | Calvary Temple

పల్లవి: గురుతు చేసుకో ఓ ప్రియుడా - గుడిలో చేసిన ప్రమాణ సూత్రము 
మరిచిపోకుమా ఓ ప్రియతమా -మెడలో కట్టిన ఆ మంగళసూత్రం 
తిరగబడితే క్రీస్తు కొరడా - చెళ్ళుమంటుందీ శుద్ధీకరణ

1. స్వదేశీ సంస్కృతి మరిచి - విదేశీ సంస్కృతి మరిగి 
ఆత్మీయతను అణచి - అనురాగాన్ని విడచి 
పబ్ క్లబ్ల తైతక్కలాడి - కాముకత్వము తలకెక్కి 
భార్యాభర్తల మార్పిడి చూడు 
కుటుంబ వ్యవస్థ దోపిడి నేడు ||గురుతు||

2. సాటి సహాయము మరిచి సూటిపోటిగా పొడిచి 
భర్తను అనుమానించి - పిల్లల భవితను విడిచి 
ఇంటి గుట్టును రట్టుగ చేసి - భార్య నెదిరించి గడప దాటితే 
పెళ్ళి కాస్త పెటాకులై - కొంప కొల్లేరౌతుంది ॥గురుతు||

Post a Comment

0 Comments