పల్లవి: దిగులు పడకు సేవకా దిగులు పడకుమయా
నమ్మదగిన దేవుడు - నిన్ను పిలిచె గదా
కష్టాలు తీర్చి - కన్నీటిని తుడిచి - ఆదరించునుగా
నీతోనే నడచి - నీలోనే నిలచి నిన్ను నడుపునుగా
ఓ సేవకా భయపడక - జయము నీదె గదా ||దిగులు||
1. అగ్నివంటి శోధనలకు భయపడకుమయా
అగ్నిలోను క్రీస్తు అండ - తోడుండగా
అగ్ని గుండమే - నిన్ను హెచ్చించి ఘనపరచునుగా
షద్రకు మేషకబెద్నెగోలను - మరచిపోకుమా
ఓ సేవకా భయపడికికా - అగ్ని మేలెగదా ||దిగులు||
2. ఏమి తిందునో ఎక్కడ ఉందునో - చింతించకుమా
నీకున్న అవసరతలు - తండ్రికి తెలియునుగా
ఆకాశము నుండి - మన్నాను పంపి - పోషించే గదా
ఐదు రొట్టెలు - రెండు చేపలు సంగతి మరువకుమా
ఓ సేవకా భయపడకిక గంపలు మిగిలెగదా ॥దిగులు॥
3. నీవు కలిగిన దర్శనమును విడిచిపెట్టకుమా
లోకాశలకు ధన సంపదకు లొంగిపోకుమా
స్త్రీ వ్యామోహం ఈ లోక స్నేహం - నీకు తగదు గదా
ఆత్మల రక్షణ - సంఘ పోషణ - నీపై నుండె గదా
ఓ సేవకా వెనుదిరుగక ముందుకు సాగమయా ॥దిగులు||

0 Comments