12 | Satyamunaku Memu Sakshulam | సత్యమునకు మేం సాక్షులము | Calvary Temple

పల్లవి: సత్యమునకు మేం సాక్షులము -క్రీస్తుకు మేము సాక్షులము 
రోషముగల దేవుని ప్రజలం-సత్యము కలిగి జీవిస్తాం 
రోషముగల దేవుని ప్రజలం - సత్యము కొరకు మరణిస్తాం 
హోసన్నా హోసన్నా - హోసన్నా హోసన్నా 
హోసన్నా... హోసన్నా... హోసన్నా...

1. ఉమ్ములూసినా - మొఖము త్రిప్పము 
ముళ్ళు గ్రుచ్చినా - తలను వొంచము 
కొరడ విసిరినా - వెనుక తిరుగము 
బల్లెము పొడిచినా - భయపడము ॥2॥ 
సత్యము కలిగి జీవిస్తాం 
సత్యము కొరకు మరణిస్తాం ॥2॥ ॥హోసన్నా॥

2. మాకు మేము - తగ్గించుకొంటాం 
మోకాళ్ళ కన్నీళ్ళ - ప్రార్ధన చేస్తాం 
సిలువ సంకెళ్ళ - సమర్పణ చేస్తాం 
దేవుని రాజ్యము - రగిలిస్తాం 
సత్యము కలిగి జీవిస్తాం 
సత్యము కొరకు మరణిస్తాం ॥2॥॥హోసన్నా॥

Post a Comment

0 Comments