16 | Naatho Mataladumayya | నాతో మాట్లాడుమయ్యా | Calvary Temple

పల్లవి: నాతో మాట్లాడుమయ్యా నన్నూ దర్శించుమయ్యా 
నీ మందిరాన - నీ సన్నిధాన 
నీ ఆత్మతో నన్ను - నింపుమయా  ॥నాతో॥ 
యేసయ్యా... ఆ.. ఆ.. యేసయ్యా... ఆ.. ఆ.. యేసయ్యా... ఆ..ఆ.. 
యేసయ్యా...... యేసయ్యా.......    ॥2॥ 

1. కన్నీళ్ళైనా కష్టాలెదురైనా - కడవరకు నను చేర్చుమయ్యా 
కరువు తోడైనా - కలిమి వేరైనా కరుణించి కాపాడుమయ్యా 
నా వేదనలో నీ జాలితో నా శోధనలో నీ చేతితో 
నిత్యము నను నడిపించుమయ్యా..... ॥యేసయ్యా॥

2. నావారే నన్ను నిందించువేళ - నను విడచి పోబోకుమయ్యా 
ఆదరణ నాకు కరువైనవేళ దరిచేర్చి ఓదార్చుమయ్యా 
నా నిందలలో నా తోడువై అపనిందలలో నా చేరువై 
నిత్యము నను నడిపించుమయ్యా..... ॥యేసయ్యా॥

3. నా కాలు జారి తొట్రిల్లువేళ చేజాచి నిలబెట్టుమయ్యా 
సాతాను నన్ను బంధించువేళ - ననుచేరి విడిపించుమయ్యా 
నీ చేతితో నను పట్టుకో - నీ సేవలో నను వాడుకో 
నిత్యము నను నడిపించుమయ్యా..... ॥యేసయ్యా॥

Post a Comment

0 Comments