214 Shaswatha Prematho / శాశ్వత ప్రేమతో / Athmiya Geetalu

ప॥ శాశ్వత ప్రేమతో - నన్ను ప్రేమించావయ్య 
కృప చేతనే - నన్ను రక్షించావయ్య

అ॥ నీ ప్రేమ గొప్పది - నీ జాలి గొప్పది 
నీ కృప గొప్పది - నీ దయ గొప్పది  ॥శాశ్వత॥

1. అనాధనైన నన్ను - వెదక వచ్చితివి 
ప్రేమ చూపి కౌగిలించి - కాచుచుంటివే (2)॥నీ ప్రేమ॥

2. అస్థిరమైన లోకములో - తిరిగితినయ్య 
సాటిలేని యేసయ్యా - చేర్చుకొంటివే (2)॥నీ ప్రేమ॥

Post a Comment

0 Comments