213 భయము చెందకు భక్తుడా / Bayamu Chendaku Bakthuda / Athmiya Geetalu

భయము చెందకు భక్తుడా -ఈ మాయలోక ఛాయను చూచినప్పుడు 
భయము చెందకు నీకు - జయము దయచేయువాడు
దేవుడెహోవా యున్నాడు.
నీ సాయమునకు - దేవుడేసన్నయున్నాడు.

1. బబులోను దేశమందునా - ఆ భక్తులు ముగ్గురు బొమ్మకు 
మ్రొక్కనందునా - పట్టి బంధించి రాజు అగ్ని గుండంలో వేసే 
నాల్గవవాడు ఉండలేదా - ఓభక్తుడా నాల్గవవాడు ఉండలేదా ||భయము||

2. చెరసాలలో వేసినా - తమ దేహమంతా గాయాలతో నిండినా 
పాడి కీర్తించి పౌలు సీలలు కొనియాడ - భూకంపం కలుగలేదా
ఓ భక్తుడా భూకంపం కలుగలేదా ఆ భక్తులు ముగ్గురు చెరనుండి విడుదల కాలేదా ||భయము||

3. ఆస్థి అంతా పోయినా - తన దేహమంతా కురుపులతో నిండినా 
అన్నీ ఇచ్చిన తండ్రి అన్నీ తీసుకుపోయె అని యోబు పలుకలేదా.. 
ఓ భక్తుడా అన్ని మరల ఇవ్వలేదా ||భయము||

Post a Comment

0 Comments