మనసు మలినమైన నాకై మనిషిగా దిగి వచ్చావా..
అ: నా మది నీ కోవెలగా మలచుకోవయా
నా హృదిలో రారాజుగా నిలచిపోవయ్యా
1. హృదయము వ్యాధితో నిండిన కపట కేంద్రము
దానిని గ్రహియించుట ఎవరి సాధ్యము
మనసు మర్మమెరిగిన మహనీయుడా
మనసు మార్చగలిగిన నిజ దేవుడా ॥నా మది॥
2. చెంచల మనసాడించు బ్రతుకు ఆటను
వంచన చేసి నడుపును తప్పుబాటను
అంతరంగమును పరిశీలించు యేసయ్యా
స్థిర మనస్సుతో నీ దారిలో సాగనీవయ్యా ॥నా మది॥
3. నిండు మనస్సుతో నిన్ను ఆశ్రయించితి
దీన మనస్సుతో నీ కడ శిరము వంచితి
పూర్ణశాంతి గలవానిగ నన్ను మార్చుమా
తరతరములకు క్షేమము చేకూర్చుమా ॥నా మది॥
0 Comments