191 Yesayya Na Hrudhayabhilasha / యేసయ్యా నా హృదయాభిలాష / Athmiya Geethalu

ప॥ యేసయ్యా నా హృదయాభిలాష నీవేనయ్యా 
మెస్సయ్యా నా తియ్యని తలంపులు నీవేనయ్యా
॥యేసయ్యా॥

1. పగలు మేఘస్తంభమై రాత్రి అగ్ని స్తంభమై 
నా పితరులను ఆవరించి ఆదరించిన మహానీయుడవు
పూజనీయుడా - నీతిసూర్యుడా నిత్యము నాకనులమెదలు చున్నవాడా ॥ యేసయ్యా॥

2. ఆత్మీయ పోరాటాలలో - శత్రువు తంత్రాలన్నిటిలో 
మెలుకువ కలిగి ఎదురించుటకు శక్తితో నింపిన షాలేము రాజా 
విజయశీలుడా-పరిశుద్ధాత్ముడా నిత్యము నాలోనే-నిలచియున్నవాడా ॥యేసయ్యాll

Post a Comment

0 Comments