45 Nannenthagano / నన్నెంతగానో ప్రేమించెను / Athmiya Geethalu

పల్లవి: నన్నెంతగానో ప్రేమించెను - నన్నెంతగానో కరుణించెను
నా యేసుడు నా పాపము నా శాపము తొలగించెను నన్ను కరుణించెను.
॥నన్నెంత॥

1. సాతాను బంధాలలో జీవపుడంబాలలో 
పడనీయక దరి చేరనీయక 
తన కృపలో నిరతంబు నను నిల్పెను
॥నన్నెంత॥

2. సత్యంబు జీవంబును - ఈ బ్రతుకు సాఫల్యము 
నేర్పించెను నాకు చూపించెను 
వర్ణించగా లేను ఆ ప్రభువును

3. కల్వరిగిరిపైననూ - ఆ సిల్వ మరణమును 
నా కోసమే శ్రమ పొందెను 
నా పాపమంతటిని క్షమియించెను ॥నన్నెంత॥

4. ఘనమైన ఆ ప్రేమకు - వెలలేని త్యాగంబుకు ఏమిత్తును నేనే మిత్తును
నను నేను ఆ ప్రభుకు సమర్పింతును ॥నన్నెంత॥

Post a Comment

0 Comments