సిలువను గూర్చిన వార్త
శ్రీ యేసుని గూర్చిన వార్త ||2||
1. క్రీస్తు నందున్నా వారికి
యే శిక్షావిధి లేదు ||2||
ఆ క్రీస్తునందున్న యెడల
నిత్య జీవం పొందుదువన్న ||2||
హల్లెలూయ.... హల్లెలూయ.......||2||
2. నశియించుచున్న వారికి
వెర్రితనము ఈ సువార్త ||2||
రక్షింప బడువారికి
దేవుని శక్తి వున్నది ||2||
3. సిలువ వార్త గైకొనకున్నా
నీకు నరకాగ్ని తప్పదన్నా ||2||
సిలువ వార్త నువ్వు నమ్మిన
పరలోకం ప్రాప్తించునన్నా ||2|| హేయ్
0 Comments