Raja Nee Sannidhilone|రాజా నీ సన్నిధిలోనే| Song Lyrics In Telugu

Raja Nee Sannidhilone Song Lyrics



పల్లవి: రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్య
మనసారా ఆరాధిస్తు బ్రతికేస్తానయ్య ||2||
నేనుండలేనయ్య నే బ్రతుకలేనయ్య ||2||
నీవే లేకుండా నేనుండలేనయ్య ||2||
నీ తోడే లేకుండా నే బ్రతుకలేనయ్య ||2|| ||నేనుండ||

1.నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం
ఆరాధించుకొనే విలువైన అవకాశం ||2||
కోల్పోయినవన్ని నాకు ఇచ్చుటకును
బాధల నుండి బ్రతికించుటకును ||2||
నీవే రాకపోతే నేనేమైపోదునో ||2|| ||నేనుండ||

2.ఒంటరి పోరు నన్ను విసిగించిన
మనుషులెల్లరు నన్ను తప్పుపట్టినా ||2||
ఒంటరివాడే వేయి మంది అన్నావు
నేనున్నానులే భయపడకు అన్నావు ||2||
నేనంటే నీకు ఇంత ప్రేమ ఏంటయ్య ||2|| ||నేనుండ||

3.ఊపిరాగేవరకు నీతోనే జీవిస్తా 
ఏ దారిలో నడిపిన నీ వెంటే నడిచోస్తా ||2||
విశ్వానికి కర్త నీవే నా గమ్యము
నీ బాటలో నడుచుట నాకెంతో ఇష్టము ||2||
నిన్ను మించిన దేవుడే లేడయ్య ||2|| ||నేనుండ||

Post a Comment

0 Comments