Nenunna Sthithilone Song Lyrics
పల్లవి: నేనున్న స్థితిలోనే సంతృప్తిని
కలిగించు ఏమున్నా లేకున్నా నీకొరకే బ్రతికించు - ||2||
అ.ప: కష్టాలు ఎదురైనా నా యాత్రను సాగించు
నష్టాలలోనైనా స్తుతిచేయుట నేర్పించు - ||2||
1. లోకములో నీ కొరకు - జ్యోతిగ నను వెలిగించు ||2||
రెండవ రాకడవరకు విడువక - నను నడిపించు ||2|| ||కష్టాలు||
2. నా దినముల పరిమాణం - లెక్కించుట నేర్పించు ||2||
నా లోపల స్థిర హృదయం - నూతనముగ పుట్టించు ||2|| ||కష్టాలు||
నా లోపల స్థిర హృదయం - నూతనముగ పుట్టించు ||2|| ||కష్టాలు||
3. సరియగు త్రోవను నడువ - కట్టడలను బోధించు||2||
సమయోచిత జ్ఞానమును - దయచేసి దీవించు ||2||. ||కష్టాలు||
0 Comments