204 Yesayya Na Dhora / యేసయ్యా ! నా దొర /Athmiya Geetalu

యేసయ్యా ! నా దొర - నీ సాటి ఎవరయ్యా ఈ ధర
నా కోసమే వచ్చిన సర్వేశ్వరా - నను విడిపించిన కరుణాకర

అ|| మనసారా నిన్నే కొలుతు ప్రాణేశ్వరా ! 
వేసారి పోనయ్యా - ధవళాంభరాః ॥2॥

1. మండే నా బ్రతుకే, పాటగా - నిండైన నీ బ్రతుకే బాటగా 
పండంటి నీ ప్రేమ, తోటలో - మెండైన నీ వాక్యపు ఊటలో 
దొరికింది నా వరాలమూట సప్తస్వరాలే చాలవింక, నా నోట ॥యేసయ్యా॥

2. నలిగిన నా బ్రతుకే అర్పణమయ్యా - వెలుగైన నీ వాక్యమే దర్పణమయ్యా 
మిగిలిన శ్రమలను సంతర్పణలో కదిలే కన్నీటి అర్చనలో 
పండింది నా నోముల పంట - ఎంత పంచినా తరగదు ఇదేంటంట ॥యేసయ్యా॥

3. నా దాగుచోటు నీవేనయ్యా - చికాకు పడక నన్ను కాచేవయ్యా 
ఏకాకి నేనింక, కాబోనయ్య - నీ రాక కోసమే ఉన్నానయ్యా 
శ్రీమంతుడా, సాత్వికుడా-పరిపూర్ణుడా, కడు దీనుడా ॥యేసయ్యా॥

Post a Comment

0 Comments