202 Na Yesu Premane Marathuna / నా యేసు ప్రేమనే మరతునా / Athmiya Geetalu

ప: నా యేసు ప్రేమనే మరతునా, ఈ దివ్య సేవ
నే విడుతునా నా యేసువా ! నా యేసురాజా ! 
నీ ప్రేమేలోనన్ నిలుపుమా ఈ సేవలోనన్ నడుపుమా ॥నా యేసు||

1. గతిలేని నేను మతిమాలిపోగా మితిలేని ప్రేమన్
బ్రతిమాలినావే అతి ప్రియుడా - అతి కాంక్షనీయుడా నీ నీతిలోనన్ నిలుపుమా - నీ చేతిలోనన్ మలచుమా ॥నా యేసు||

2. భ్రమచేత నేను క్రమమెరుగనైతి
శ్రమయందు నేనీ క్షమవేడితిన్ - నజరేయుడా నరుడైన దేవా ! 
నీ ప్రేమలోనన్ నిలుపుమా నీ సేవలోనన్ నడుపుమా ॥నా యేసు॥

Post a Comment

0 Comments