బలవంతుడా - పరిశుద్ధుడా
కదలిరావోయ్ - నీవు కదలిరా
అ॥ జాలరీ - మనుష్యుల పట్టు జాలరీ
ఆత్మలకాయు కాపరి - అమృత మందించే ఆచారి
యేసు జీవించే పూజారి
1. సిలువే నీ స్థావరము - శ్రమలే నీ సైన్యము
సహనమే నీ ధైర్యము - సాక్ష్యమే నీ విజయము
llక్రైస్తవుడా॥
2. త్యాగమే నీ క్షేమము - ప్రార్థనే నీ యౌవ్వనము
వాక్యమే నీ బాణము - విశ్వాసమే ఉద్యమము
॥క్రైస్తవుడా॥
3.సత్యమే నీ గమ్యము - సమర్పణే నీ శీలము
యేసే నీ కార్యక్రమం - ప్రేమే నీ పరాక్రమం
||క్రైస్తవుడా||
4.దేశంలో విదేశంలో - గ్రామంలో కుగ్రామంలో అడవులలో కొండలలో - పని యెంతో ఫలమెంతో
||క్రైస్తవుడా||
5. జయించిలే శరీరాన్ని - ధరించుకో శిరస్త్రాణాన్ని
బంధించు విషపు సర్పాన్ని బోధించు యేసు పథకాన్ని ॥క్రైస్తవుడా॥
6. సిద్ధాంతపు గట్టు దుమికిరా - సాకులనె మెట్టులు దిగిరా
దీనుడ కడు ధన్యుడా - విధేయుడా - అజేయుడా ॥క్రైస్తవుడా||
7. వాగ్దాన భూమి స్వతంత్రించుకో
అధ్వాన్నపుటడవి దాటి ముందుకుపో
నీ ఇల్లే పెనూయేలు నీ పేరే ఇశ్రాయేలు ॥క్రైస్తవుడా||
8. సంఘమే - నీ రంగస్థలము - సహవాసమే నీ స్థానము
యేసే నీ నాయకుడు - శుద్ధాత్ముడే ధర్మకుడు
॥క్రైస్తవుడా||
0 Comments