నీ గమ్యము ఏదో యీ పయన మెన్నాళ్లయి
అ॥ ఆగుమా నేస్తమా, ఆగుమా నేస్తమా
ఆగి యోచన చేయుమా, నీ గమ్యమేదో ఎరుగుమా
1. వేడుకగా నీవు గుడికెళ్ళేవు - వాడుకగా వాక్యము విన్నావు
నీ దేహమే దేవుని గుడియని - ఆ వాక్యమే ఆయన స్వరమని
ఎరుగుదువా నీవు నేస్తమా - ఆగి యోచన చేయుమా llపరుగుll
2. నియమము తప్పక ప్రార్థించేవు - తాళము తప్పక పాటలు పాడేవు
నీవు ప్రార్థించే ఆ యేసునీ పరిపాలించే ఆ క్రీస్తుని
ఎరుగుదువా నీవు నేస్తమా - ఆగి యోచన చేయుమా llపరుగుll
3. సంఘములో నీవు సభ్యునివైనావు - దొంగవలె రంగులు మార్చేవు
మోసపోకుమా - దేవుడు వెక్కిరించబడునా
విడిచిపోకుమా - నిన్ను పిలుచు యేసుని
నిలిచి చూడుమా విలపించు క్రీస్తుని
తరుణ మిదేనోయి నేస్తమా - ఆగి యోచన చేయుమా llపరుగుll
0 Comments