195 Yesanna Sarvamanna / యేసన్న స్వరమన్నా / Athmiya Geetalu

ప: యేసన్న స్వరమన్నా - నీవెపుడైనా విన్నావా?

1. జలముల శబ్దము జనముల శబ్దము - బలమైన ఉరుములతో
కలిసిన స్వరము - నిలిచిన యేసు 
పిలిచిన పిలుపును - నీ వింటివా llయేసన్నll

2. ఏదేను తోటలో ఆదాము చెడగా - ఆ దేవుడే పిలచే 
ఆదాము ఎదుటను - అరుగక దాగిన 
అటులనే నీవును దాగెదవా llయేసన్నll

3. సౌలా సౌలా నన్నేల హింసింతువు - చాలించుమనే స్వరమూ 
సౌలాధిపతినంత - సంధించగానే 
సద్భక్తుడై పౌలు - గా మారెగా llయేసన్నll

4. స్వరమును వినగా పరమార్ధజ్ఞాని - స్థిరుడైన యోహాను 
పరమ మర్మాలు - భవిషద్విషయాలు 
ప్రకటించే ప్రతిరోజు - స్మరియించుమా llయేసన్నll

Post a Comment

0 Comments